AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇది కాంగ్రెస్ విజయం కాదు.. రేవంత్ రెడ్డి విజయం.. ఆర్జీవీ ట్వీట్..

టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ.. సినిమా టు పాలిటిక్స్ ఏదో విషయం పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వైరల్ అవుతుంటారు. ఇక నేడు తెలంగాణ ఎలక్షన్స్ రిజల్ట్ డే కావడంతో ప్రతి ఒక్కరు ఏమవుతుందా..? అని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ దూకుడు చూపిస్తూ ముందుకు వెళ్తుంది. ఇక కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతం నుంచి భారీ విజయాన్ని అందుకున్నారు. దీంతో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీస్ వరకు ట్వీట్స్ చేస్తూ వస్తున్నారు.

ఈక్రమంలోనే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఒక ట్వీట్ చేశారు. “కాంగ్రెస్ ఇతర రాష్ట్రాల్లో పరాజయాన్ని ఎదుర్కొంది. తెలంగాణ విజయం చూస్తుంది. అయితే ఈ విజయం కాంగ్రెస్‌ది కాదు రేవంత్ రెడ్డిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీరు మీ బాహుబలి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేయాలి” అంటూ ట్వీట్ చేశారు. ఇక అలాగే జీవితంలో మొదటిసారి రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ ప్రతి పై గౌరవం కలుగుతుందని చెప్పుకొచ్చారు. గౌరవిలైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూస్తే చాలా గర్వంగా ఉందంటూ పేర్కొన్నారు.

ANN TOP 10