AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లి గెలిచిన నేతలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ఆదివారం జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి టిక్కెట్లు ఆశించి.. సీట్లు రాకపోవడంతో ఆ నేతలు కాంగ్రెస్‌లో చేరి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరి గెలిచిన నేతలు వీరే…

నకిరేకల్ – వేముల వీరేశం..

కొల్లాపూర్ -జూపల్లి కృష్ణారావు..

కల్వకుర్తి -కసిరెడ్డి నారాయణ రెడ్డి..

తుంగతుర్తి- మందుల సామేల్..

ఖమ్మం.. తుమ్మల నాగేశ్వరరావు..

పాలేరు- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

పినపాక – పాయం వేంకటేశ్వర్లు..

ఇల్లందు- కోరం కనకయ్య…
కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలైంది. పోస్టల్ బ్యాలెట్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరిచింది. రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కాంగ్రెస్ ఆధిక్యం దిశలో దూసుకుపోతోంది.

ANN TOP 10