AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ విజయంపై కోదండరాం హర్షం

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంపై టీజేఎస్ పార్టీ చీఫ్ కోదండరాం హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం అసెంబ్లీ ముందున్న గన్ పార్క్‌‌కు కోదండరాం చేరుకున్నారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంపై కోదండరాం సంతోషం వ్యక్తం చేశారు. నాంపల్లి టీజేఎస్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకు సాగింది. అందులో భాగంగా అనేక పార్టీలతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. అలాగే టీజేఎస్‌తో కూడా కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కోదండరాం పలు కండీషన్లు పెట్టగా అందుకు కాంగ్రెస్‌ కూడా సుముఖత వ్యక్తం చేసింది. దీంతో కాంగ్రెస్‌తో పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోదండరాం.. కాంగ్రెస్‌‌తో కలిసి ఎన్నికల్లో పనిచేసింది.

ANN TOP 10