AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యం

తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. కాంగ్రెస్‌ ఆధిక్యంలో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది.. తెలంగాణ దంగల్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు నెలకొంది. ఆదివారం ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది. మరికాసేపట్లో ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడనున్నాయి. ఉదయం 10గంటల వరకు బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతోపాటు.. రెండు రౌండ్ల వరకు కౌంటింగ్ జరిగింది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి కొడంగల్, కామారెడ్డిలో ముందంజలో ఉండగా.. సీఎం కేసీఆర్ గజ్వేల్ లో ముందంజలో కొనసాగుతున్నాయి. చాలామంది ప్రముఖ నేతలు వెనుకంజలో కొనసాగుతున్నారు.

రాష్ట్రంలో మొత్తం 119 నియోజకవర్గాలకుగానూ ఆదివారం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపునకు 49 ప్రాంతాల్లో 119 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 1,798 టేబుళ్లలో 2,417 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేస్తున్నా. అతితక్కువ ఓటర్లు, తక్కువ పోలింగ్‌ కేంద్రాలున్న భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నది. అత్యధిక పోలింగ్‌ కేంద్రాలు, ఎక్కువ ఓటర్లున్న శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గాల ఫలితం ఆలస్యం అయ్యే చాన్స్‌ ఉన్నది. భద్రాచలంలో 13, అశ్వారావుపేటలో 14, చార్మినార్‌లో 15, ఆర్మూర్‌లో 16 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది.

ANN TOP 10