– ఇంటర్వ్యూలు, తప్పుడు ప్రకటనలపై అభ్యంతరం
– చర్యలకు ఈసీ సన్నద్ధం!
మంత్రి కేటీఆర్ తీరుపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రావును కాంగ్రెస్ బృందం కలిసింది. ప్రభుత్వ భవనాల్లో కేటీఆర్ ఇంటర్వ్యూలు, న్యూస్ పేపర్‌లో తప్పుడు ప్రకటన ఇవ్వడంపై కాంగ్రెస్ కంప్లైంట్ చేసింది. కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ భవనం (టీ హబ్)లో విద్యార్థులు, యువతతో కేటీఆర్ మీటింగ్ పెట్టి ప్రచారం చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రావును కాంగ్రెస్ బృందం కలిసి వినతి పత్రం అందజేసింది. కాంగ్రెస్ కంప్లైంట్ నేపథ్యంలో కేటీఆర్‌పై చర్యలకు తీసుకునేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.









