AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ నివాసాల్లో ఐటీ సోదాలు.. మంచిర్యాలలో తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) రైడ్స్ కలకలం రేపుతున్నాయి. తాజాగా.. చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్‌ వెంకటస్వామికి సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు మరింత హీట్ పెంచాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌, మంచిర్యాలలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వివేక్‌ నివాసాలతోపాటు సోదరుడు వినోద్‌, కుమారుడు, కూతురు, బంధువులు, అనుచరుల ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

మొత్తం నాలుగు బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే వివేక్‌ కంపెనీలకు చెందిన 8కోట్ల రూపాయలను ఫ్రీజ్‌ చేశారు పోలీసులు. నాలుగు రోజులక్రితం 50లక్షల నగదుతో పట్టుబడ్డారు వివేక్‌ కంపెనీ ఉద్యోగులు. ఇక, ఇప్పుడు ఏకంగా ఐటీ రెయిడ్స్‌ జరగడం కలకలం రేపుతోంది. వివేక్ నివాసాల్లో ఐటీ రెయిడ్స్‌ చేయడంపై ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. మంచిర్యాలలోని వివేక్‌ ఇంటికి పెద్దఎత్తున చేరుకుంటున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. కావాలనే టార్గెట్‌చేసి ఐటీ తనిఖీలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో వివేక్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తల ఆందోళన నేపథ్యంలో పోలీసు బలగాలను భారీగా మోహరించారు.

ANN TOP 10