గత ఎన్నికలలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని గద్దనెక్కిన మోదీ ప్రభుత్వం, యేటా జాబ్ క్యాలెండర్ తీస్తూ ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ నిరుద్యోగులను దగా చేసి నియంత పాలన సాగిస్తున్నారని వారి పాలనలకు చిరమగీతం పాడాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పి. సోమయ్య ఓటర్లను కోరారు. సీపీఎం అసెంబ్లీ అభ్యర్థి దుగ్గి కృష్ణ విజయాన్ని కాంక్షిస్తూ లేబర్ అడ్డా వద్ద సోమవారం రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ధరలు ఆకాశాన్ని అంటాయని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలు, కుల దురహంకార దాడులు, ప్రైవేటీకరణలు పెరిగాయన్నారు. ప్రశ్నించిన వారిపై దేశద్రోహం ముద్రలు వేస్తూ కోర్టులు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ ఇబ్బందుల గురించి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ 9 ఏళ్ల పాలనలో పరకాల ప్రవేశపెట్టి ప్రజా మద్దతు పొందాలని చూస్తున్నారని అన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసి, కనీసం ఉద్యోగులకు నెలనెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. గ్రామాల్లో, వీధుల్లో మద్యం ఏరులై పారిస్తూ వచ్చే ఆదాయంపై ప్రభుత్వాన్ని నెట్టుకు రావడం సిగ్గుచేటన్నారు. అధికార పక్షాన్ని నిలదీయడానికి దుగ్గి కృష్ణకు నియోజకవర్గ ప్రజలంతా ఓటు వేసి అసెంబ్లీకి పంపాలని కోరారు.









