బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్ మెడలో పాముతో కనిపిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుమార్తె ఈషా గతేడాది నవంబరు 19న కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ కవల పిల్లలకు ముంబయిలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు బాలీవుడ్ తారలు కూడా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వచ్చిన షారుఖ్ ఖాన్ మెడలో పాముతో సందడి చేశారు. మొదట అనంత్ అంబానీ… షారుఖ్ ఖాన్ చేతికి ఓ పామును అందిస్తుండగా, వెనుక నుంచి మరొకరు ఆయన మెడలో పామును వేయడం వీడియోలో కనిపించింది. అయితే, ఎలాంటి ఆందోళనకు గురికాకుండా షారుఖ్ ఖాన్ ప్రశాంతంగా అనంత్ అంబానీతో మాట్లాడారు.









