AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వార్ వన్ సైడ్.. పెరిగిన కంది గ్రాఫ్

బిఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశం ఉందంటున్న పరిశీలకులు
శ్రీనన్నకు అడుగడుగునా ఆధరణ
నీరాజనాలు పలుకుతున్న ఓటర్లు
ప్రచారంలో పోటెత్తుతున్న జనం
విజయం ఖాయమంటున్న పరిశీలకులు

ఒక వ్యక్తిగా రాజకీయ ప్రవేశం చేసిన కంది శ్రీనివాస రెడ్డి ఇప్పుడు ఆదిలాబాద్ రాజకీయాలలో ప్రబల శక్తిగా మారాడు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కంది శీనన్నను ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. గత కొన్నేళ్ళుగా సామాజిక సేవ ద్వారా ప్రజల మనసులలో స్థానం ఏర్పరచుకున్న శ్రీనివాసరెడ్డి అదే తరహాలో ఒటర్ల మనసులో సుస్థిర చోటును సంపాదించుకుంటున్నారు. యువనేత, జననేతగా ప్రశంసలను అందుకుంటున్న కంది శ్రీనివాస రెడ్డి ప్రచారాన్ని, ఓటర్ల నాడిని పరశీలిస్తే రోజురోజుకూ ఆయన గ్రాఫ్ పెరుగుతోంది.


స్వంత పార్టీ నేతలకు తోడుగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కంది శీనన్నను గెలిపించుకునేందుకు కదం కదం కలిపి నడిచేందుకు వస్తుండటం పరిశీలిస్తే ఆయన గెలుపును ఎవరూ ఆపలేరన్న విషయం స్పష్టమవుతోంది. గడచిన 15 సంవత్సరాలుగా ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే జోగు రామన్న అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని, ఆదిలాబాద్ అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఆషాకిరణంలా కంది శ్రీనివాసరెడ్డి కనిపించారు. అక్షర క్రమంలో ఆదిలాబాద్ ముందున్నప్పటికీ అభివృద్ధిలో అందనంత ఆగధంలో ఉండటం, కంది శీనన్న ఆశయాలు, ఆయన సేవా తత్పరత, ప్రజల కష్టసుఖాలను తెలుసుకుని గత కొత కాలంగా అందిస్తున్న సేవలు, సమాజం కోసం ఏదో చేయాలన్న తపనను గుర్తించిన ఆదిలాబాద్ ప్రజలు ఆయనే తమ నేత, తమ ఎమ్మెల్యే అన్న భావనకు వచ్చారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించి కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని స్వంత గడ్డకు ఏదో చేయాలన్న ధృఢ సంకల్పంతో ఆయన రాజకీయాలలోకి వచ్చారన్న భావన నియోజకవర్గ ప్రజల్లో రోజురోజుకూ బలపడుతోంది.

కంది శ్రీనివాస రెడ్డిని బలహీన పర్చాలన్న ప్రత్యర్థి పార్టీల కుట్రలను కూడా గ్రహిస్తున్న ప్రజలు ఛీ కొడుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోని కొంత మంది నేతలు బీఆర్ఎస్, బీజేపీలతో చేతులు కలిపి కంది శ్రీనివాసరెడ్డిని ఓడించేందుకు శక్తి యుక్తులు ఒడ్డుతున్నా, ఎన్నికల ప్రచారంలో కంది ఎక్కడకు వెళ్ళిన ఆదరించి అక్కున చేర్చుకోవడంతో పాటు మీతో పాటు మేమున్నామంటూ తండోపతండాలుగా వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యర్థి పార్టీలను గ్రామ పొలుమేరల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారంటే కంది శ్రీనివాసరెడ్డి ఓటర్లలో ఎంత అభిమానం ఉందో స్పష్టమవుతోంది. రాజకీయాలలో రాటు దేలిన నేతలు సైతం కందికి ప్రజల్లో వస్తున్న ఆధరణ, ఆప్యాయతను చూసి ఓర్వలేక లేనిపోని ఆబాండాలను వేస్తున్నారు. అయినప్పటికీ ప్రజలెవరూ తమ అభిమాన నేత, ఆత్మీయుడిపై ఇవన్నీ సహజమేనని కొట్టి పారేస్తున్నారు తప్ప నమ్మేందుకు కూడా సిద్దంగా లేరు.

ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎక్కడ ఏ మూలన ఎవరిని కదిలించినా కంది శ్రీనివాస రెడ్డి సేవగుణం, ఆయన పేదల పట్ల చూపే అప్యాయత, అనురాగాలు, ఆపత్కాలంలో చేయూతనిచ్చి ఆదుకున్న తీరును తెలుపుతున్నారు. ఎన్నికలప్పుడే కంది శ్రీనివాస రెడ్డి కనిపిస్తున్నాడంటున్న వారి ముఖాన పిడిగుద్దులతో సమాధానం చెప్పినట్లుగా గత కొన్నాళ్ళుగా ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. పదవుల కోసం కంది శ్రీనివాస రెడ్డి పని చేయడం లేదని, పేదల సంక్షేమం కోసం, వెనుకబడిన ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఆయన తాపత్రయపడుతున్నారన్న చర్చ కొనసాగుతోంది. ఈ దఫా అధికార పార్టీ అడ్రస్ గల్లంతు చేయడమే తమ లక్ష్యమని ఓటర్లు శపథం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు వస్తున్నారని, ఎన్నికలంటే ఏమిటో తెలియని సమయంలోనూ కంది శీనన్న తమకు అండగా ఉన్నారని, అలాంటి నేతకే తమ అండదండలుంటాయని నియోజకవర్గ ప్రజలు ఏకతాటిపై నిలిచి ఎలుగెత్తి చాటుతున్నారు.

ANN TOP 10