కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డిసెంబర్ 9న డెఫినెట్‌గాక్లీన్ షేవ్‌తో కనిపిస్తానన్నారు. తమ మేనిఫెస్టో అద్భుతంగా ఉందన్నారు. కానీ 420 లకి అన్ని 420 లాగే కనిపిస్తాయని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు మెంటల్‌తో రబ్బిష్ గా మాట్లాడుతున్నారన్నారు. కర్ణాటక వెళ్లి వచ్చానని.. అక్కడి గ్యారెంటీ స్కీములు అమలవుతున్నాయన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశానికి కట్టుబడి ఉంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.









