AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్‌ @ 71 – ఇది జ్యోతిష్యం లెక్క

– తెలంగాణలో హస్తం జోష్‌
– జోరుగా జ్యోతిష్యుల ప్రకటనలు
– తాజాగా ప్రఖ్యాత ముస్లిం జ్యోతిష్యుడి లెక్క కూడా ఇదే..

ఎవరు కాదన్నా.. అవునన్నా.. తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్సేనట.. అది కూడా 71సీట్లకు తగ్గవట.. సీఎంగా రేవంత్‌రెడ్డి ఖాయమట.. ఇది ఎవరో చెబుతున్న లెక్క కాదు.. సాక్షాత్తు జ్యోతిష్యులు ప్రకటిస్తున్నారు. సోషల్‌ మీడియాలో వీరి ప్రకటనలు హోరెత్తుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జ్యోతిష్యులు తమ అభిప్రాయం చెబుతూ ఉంటారు. వాటిని నమ్మాలా వద్దా అనేది మన ఇష్టం. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. మరి కొత్త అంచనా ఒక్కసారి పరిశీలిస్తే..

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుంది అనే ప్రశ్న వస్తే, మనందరికీ ప్రత్యేకమైన లెక్కలుంటాయి. అయితే.. డిసెంబర్‌ 3న వచ్చే ఫలితాలతో ఎవరి అంచనా కరెక్ట్‌ అనేది తేలిపోతుంది. ఇలా చాలా సర్వేలు, చాలా మంది జ్యోతిష్యుల ప్రకటనలూ వస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా ఓ ముస్లిం జ్యోతిష్యుడు మీర్జా రఫీక్‌ బేగ్‌ అంచనా ప్రకారం కాంగ్రెస్‌కు 71 సీట్లు వస్తాయని ప్రకటించారు.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 71 సీట్లు వస్తాయని మీర్జా రఫీక్‌ అంచనా వేశారు. ఐతే.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119 కదా. కాబట్టి.. మేజిక్‌ ఫిగర్‌ 60 అవుతుంది. మీర్జా రఫీక్‌ అంచనా నిజమైతే.. కాంగ్రెస్‌కి సంపూర్ణ మెజార్టీ వచ్చినట్లవుతుంది. అందువల్ల ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ఈసారి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి సీఎం అవుతారని మీర్జా రఫీక్‌ అంటున్నారు.

ఇంకా ఏమన్నారంటే..
బషీర్‌ బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో మీర్జా రఫీక్‌.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదివరకు తాను చెప్పింది ఏదీ అబద్ధం కాలేదనీ.. బీఆర్‌ఎస్‌ పార్టీ మూడోసారి అధికారంలోకి రాదు అని కరాఖండిగా చెప్పారు.

గతంలోనూ..
2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎం అవుతారని తాను చెప్పాననీ, అలాగే.. 2019లో ఏపీలో వైఎస్‌ జగన్‌ సీఎం అవుతారని అన్నాననీ, ఇంకా.. బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో కేజ్రీవాల్‌.. అధికారంలోకి వస్తారని తాను చెప్పగా అవన్నీ అలాగే జరిగాయని మీర్జా రఫీక్‌ అన్నారు. ఇవన్నీ అలాగే జరిగాయి కనుక. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు కూడా ఖాయం అని అంటున్నారు.

ANN TOP 10