AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరంగల్ లో వరుస షాక్ లతో బీఆర్ఎస్ విలవిల.. కాంగ్రెస్ గూటికి నేతల క్యూ!!

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ వరుస షాక్ లతో విలవిలలాడుతోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. వరంగల్ తూర్పు నియోజకవర్గం లో కీలక నేత అయిన మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కొండా సురేఖను గెలిపించడం కోసం నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. ఈ క్రమంలో పలువురు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, పలువురు కీలక నాయకులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక తాజాగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కీలక నేత గుండా ప్రకాష్ రావు ఈరోజు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన గుండా ప్రకాష్ రావు, ఆ తరువాత తెలంగాణ ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. అనేక ముఖ్యమైన పదవులలో కూడా ఆయన కీలకంగా పనిచేశారు. వరంగల్ నగరపాలక సంస్థ మేయర్ గా పని చేశారు. పార్టీలో కీలక నేతగా సీనియర్ నేతగా పేరున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆయనకు సరైన గౌరవం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ఏకపక్ష ధోరణితో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన తాజాగా పార్టీ మారినట్లు తెలిపారు.

ANN TOP 10