AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఓటర్ల సంఖ్య శేరిలింగంపల్లిలో అత్యధికం

తెలంగాణలో తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో అక్టోబర్ 4న ఓటర్ల జాబితాను ప్రకటించగా 3.17 కోట్ల మంది ఓటర్లు ఉండగా, ఆ తరువాత అక్టోబర్ 31 వరకు కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం కల్పించింది ఈసీ. దీంతో మరో 9 లక్షల పైచిలుకు ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3 కోట్ల 26 లక్షల 2వేల 799 కి చేరింది. ఇందులో 1 కోటి 63 లక్షల 13 వేల 268 మంది పురుష ఓటర్లు ఉండగా, 1 కోటి 63 లక్షల 2 వేల 261 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే దాదాపుగా పురుష, మహిళా ఓటర్లు సమానంగా ఉన్నారని చెప్పవచ్చు.

45లక్షల మందితో టాప్ లో హైదరాబాద్..
ఇక తెలంగాణలో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2676 మంది ఉండగా, ఎన్ఐర్ఐ ఓటర్లు 2,949 మంది ఉన్నారు. 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయసులో ఉన్న యువ ఓటర్లు 9 లక్షల 99 వేల 667 మంది ఉన్నారని ఈసీ తెలిపింది. ఇదే సమయంలో 80 ఏళ్లు పైబడిన వృధ్ద ఓటర్లు 4, లక్షల 40 వేల 371 మంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉంగా, రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లాలో 35 లక్షల 22 వేల 420 ఓటర్లు ఉన్నారని ఎన్నికల కమీషన్ తెలిపింది. రాష్ట్రంలో 3వ స్థానంలో మేడ్చల్ జిల్లాలో 28 లక్షల 19 వేల 292 ఓటర్లు ఉన్నారు.

7లక్షల మందితో అగ్రస్థానంలో శేరిలింగంపల్లి..
ఇక నియోజకవర్గాల వారిగా చూస్తే శేరిలింగంపల్లిలో తెలంగాణలోనే అత్యధికంగా 7 లక్షల 32 వేల 560 ఓటర్లు ఉన్నారు. 2వ స్థానంలో కుత్బుల్లాపూర్ లో 6 లక్షల 99 వేల 239 మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. తెలంగాణలో అతి తక్కువగా భద్రాచలంలో 1,48,713 మంది ఓటర్లు ఉండగా, అశ్వరావుపేటలో 1 లక్ష 52 వేల 12 మందితో తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో రెండవ స్థానంలో నిలిచింది.

తెలంగాణలో మొత్తం ఓటర్లు -3,26,02,799
పురుష ఓటర్లు.. 1,63,13,268
మహిళా ఓటర్లు.. 1,63,02,261
తెలంగాణ లో ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2676
18 నుంచి 19 ఏళ్ల యువ ఓటర్లు 9,99,667
80 ఏళ్లు పైబడిన వృధ్ద ఓటర్లు 4,40,371
తెలంగాణలో NRI ఓటర్లు 2,949

హైదరాబాద్ జిల్లాలో అత్యధిక ఓటర్లు 45,36,852
రెండవ స్థానంలో రంగారెడ్డి జిల్లా-35,22,420 ఓటర్లు..
3వ స్థానంలో మేడ్చల్ జిల్లా- 28,19,292 ఓటర్లు..
భద్రాచలంలో అతి తక్కువగా 1,48,713 మంది ఓటర్లు

4వ స్థానంలో నల్గొండ- 14,64,623 మంది ఓటర్లు
5వ స్థానంలో నిజామాబాద్ – 13,95,793 మంది ఓటర్లు
6వ స్థానంలో అసిఫాబాద్ – 4,53,942 మంది ఓటర్లు
7వ స్థానంలో అదిలాబాద్ – 4,49,158 మంది ఓటర్లు
8వ స్థానంలో మెదక్ – 4,40,467 మంది ఓటర్లు
9వ స్థానంలో భూపాలపల్లి – 2,73,171 మంది ఓటర్లు
10వ స్థానంలో వనపర్తి – 2,71,371 మంది ఓటర్లు

నియోజకవర్గాల వారీగా ఓటర్ల సంఖ్య..
శేరిలింగంపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా 7,32,560 ఓటర్లు..
కుత్బుల్లాపూర్ లో 6,99,239 మంది ఓటర్లు..
3వ స్థానంలో మేడ్చల్ – 6,37,999 మంది ఓటర్లు
4వ స్థానంలో ఎల్బీ నగర్ – 5,93,762 మంది ఓటర్లు
5వ స్థానంలో రాజేంద్రనగర్ – 5,82,030 మంది ఓటర్లు
6వ స్థానంలో ఉప్పల్ – 5,29,574 మంది ఓటర్లు

ANN TOP 10