AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బోడుప్పల్‌లో మల్లారెడ్డికి షాక్.. హస్తం గూటికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు..

ఎన్నికల వెళ కారు పార్టీకి షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన బోడుప్పల్ లో ఐదుగురు కార్పొరేటర్లు హస్తం అందుకున్నారు. గురువారం మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రెష్ యాదవ్, బోడుప్పల్ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డిల అధ్వర్యంలో టీ.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన వారిలో 23 డివిజన్ కార్పొరేటర్ రాసాల వెంకటేష్ యాదవ్, ఒకటవ డివిజన్ కార్పోరేటర్ బింగి జంగయ్య యాదవ్,13 వ డివిజన్ కార్పోరేటర్ దానగళ్ల అనితా యాదగిరి,20 వ డివిజన్ కార్పోరేటర్ జడిగే మహేందర్ యాదవ్,24 వ డివిజన్ కార్పోరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ లు ఉన్నారు.

ANN TOP 10