AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నవంబర్ 30న వేతనంతో కూడిన సెలవు

నవంబర్ 30న తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర కార్మిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ కార్మిక శాఖ ప్రకటనలో వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 3న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.

మరో కీలక నిర్ణయం కాగా, ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు విస్తృతంగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అధికార బీఆర్ఎస్ తోపాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐంఎం, బీఎస్పీ, ఇతర రాజకీయ పార్టీల నేతలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. ప్రధాన పార్టీలన్నీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అంటూ ఎవరి ధీమాను వారు వ్యక్తంచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ నెలలో జరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర నేతలతోపాటు జాతీయ పార్టీల అగ్రనేతలు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఈ ఐదు రాష్ట్రాల ఎన్నిలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ANN TOP 10