ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు ఎన్నికల ప్రచారంలో పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టాడని సీఎం చంద్రశేఖర్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు.
“తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. 2014 కు ముందు కేసీఆర్ ఆర్ధిక పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆర్ధిక పరిస్థితి ఏంటి ప్రజలు ఆలోచించాలి. కూలిపోయే డ్యాములు కట్టి లక్ష కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు చంద్రశేఖర్ రావు. అక్రమంగా సంపాదించిన లక్ష కోట్లు డబ్బులు పెట్టి మూడోసారి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న కేసీఆర్‌కు బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది.
కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరూ అభద్రతకు గురి కావద్దు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తరువాత ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు జమ చేయడంతో పాటు, రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం. మీ శ్రీనన్న గెలవాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటేయాలి. అక్రమంగా సంపాదించిన లక్ష కోట్ల డబ్బుల నుంచి అక్కడ రేవంత్ రెడ్డిని ఇక్కడా నన్ను ఓడించడానికి రెండు వందల కోట్లు పంపారు. మీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే మీరందరూ హస్తం గుర్తుకు ఓటేయండి.” అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు.









