ఏప్రిల్ మొదటి వారంలో బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభమవుతుందని.. 40వేల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ హామీ ఇచ్చారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.తనపై నమోదైన కేసును కోర్టులోనే తేల్చుకుంటానని.. న్యాయస్థానంపై గౌరవం ఉందని చెప్పారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని.. సోషల్ మీడియా వచ్చాకే భయం,గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు.









