AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఢిల్లీ బయల్దేరిన కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీకి బయల్దేరారు.బంజారాహిల్స్ నివాసం నుంచి.. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బయలుదేరారు.ఈడీ నోటీసులివ్వడంతో కవిత ప్రగతిభవన్ లో తండ్రి, సీఎం అయిన కేసీఆర్ తో సమావేశం అవుతారని అందరూ భావించారు.కానీ అలాంటిది ఏమీ జరగలేదు.ఇంటి నుంచి నేరుగా ఎయిర్ పోర్టుకు బయలుదేరారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే సమయంలో కవిత వెంట ముఖ్య అనుచరులు, కొంత మంది పార్టీ నేతలు ఉన్నారు. మార్చి 9వ తేదీ విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆమె ఢిల్లీకి బయల్దేరడం ఆసక్తికరంగా మారింది.

రేపు విచారణకు హాజరుకాలేనని.. 15వ తేదీ తర్వాత వస్తానంటూ ఈడీకి లేఖ రాశారు కవిత.కవిత లేఖపై 8వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేరు ఈడీ.ఈడీ సమాధానం ఇవ్వకపోతే.. విచారణకు హాజరుకావాల్సి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.మార్చి 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహిళా బిల్లు సాధన దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగానే కవిత.. ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.ఇదే సమయంలో ఈడీ నోటీసులతో ఆసక్తి నెలకొంది.

ANN TOP 10