ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని గుర్రాల తండా గ్రామంలో హోలీ పండగ రోజు విషాదం నెలకొంది. తండాలో బండారయిని ఎత్తే పోటీలు ఆచారంగా నిర్వహిస్తారు. నిన్న జరిగిన హోలీ వేడుకలలో భాగంగా బండ రాయి పైకి ఎత్తే పోటీలు నిర్వహించగా ఒక వ్యక్తి ప్రాణాలు పోయాయి. ఇతనిపేరు కటక్ వార్ రమేష్ (45) హైదరాబాద్ లో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తాడు. హోలీ పండగకు ఇంటికి వచ్చాడు. హోలీ వేడుకలలో భాగంగా బండారయిని పైకి ఎత్తే పోటీలలో పాల్గొన్నాడు. ప్రమాద వశాత్తు బండారయి పైకి ఎత్తగా అతని మీదనే పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రి కి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతిచెందాడు.అతని భార్య ఐదేళ్లు క్రితమే మృతి చెందగా ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. దీంతో పండగ పూట ఆ గ్రామం లో విషాద ఛాయలు అలుముకున్నాయి.