కాంగ్రెస్ పార్టీ నేత, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలంగాణకు వచ్చేస్తున్నారా? ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 30, 40 రోజులు ఇక్కడే మకాం వేయనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది పొలిటికల్ సర్కిల్‌లో. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. కర్నాటకలో గెలుపుతో మాంచి జోష్‌లో ఉన్న కాంగ్రెస్.. అక్కడ విజయానికి కారణమైన డీకే శివకుమార్‌ను తెలంగాణలోనూ దింపే ప్రయత్నం చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దాదాపు నెల రోజులపాటు హైదరాబాద్‌లో ఎన్నికల నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలను పర్యవేక్షించే అవకాశం ఉంది. పార్టీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను శివకుమార్ తన ఆధీనంలోకి తీసుకుంటారని, రాబోయే ఎన్నికల్లో విజయానికి రంగం సిద్ధం చేస్తారని కాంగ్రెస్‌లోని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇటీవల బెంగళూరులో శివకుమార్‌ను కలిశారు. ఆయన్ను తెలంగాణకు ఆహ్వానించారు. తెలంగాణలో పార్టీ ప్రచారానికి రావాల్సిందిగా కోరారు. దీనిపై అంగీకరించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేఎస్.. హైదరాబాద్‌లో ఎక్కువ కాలం ఉండేందుకు వీలుగా బస ఏర్పాటు చేయాలని రేవంత్‌ను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. డీకే రాక.. తెలంగాణ పాలిటిక్స్‌లో కాకపుట్టి్స్తుంది.









