నగరంలోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 14 సంవత్సరాల బాలుడు ప్రమాదవశాత్తు నాలుగవ అంతస్తు నుండి పడి బాలుడు మృతి చెందాడు. మృతుడు శ్రీనగర్ కాలనీలోని ఓ ప్రైవేట్ అపార్ట్మెంట్‌లో వాచ్‌మెన్ కుమారుడిగా గుర్తించారు. మృతుడు దివ్యంగుడిగా తెలుస్తోంది. నాలుగో అంతస్తు నుంచి క్రింద పడడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.









