AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గన్ మెన్ పై చేయి చేసుకున్న హోంమంత్రి మహమూద్ అలీ..

తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హోం మంత్రి తన గన్ మెన్ చెంప చెళ్లుమనిపించారు. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తలసానిని ఆలింగనం చేసుకుని విషెస్ చెప్పారు. అంతలోనే ఫ్లవర్ బోకే ఎక్కడ? అని పక్కనే ఉన్న గన్ మెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నారు. ఆకస్మిక ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం పక్కనే ఉన్న బోకెను ఇతరుల సాయంతో తీసుకున్న గన్ మెన్ దానిని హోం మంత్రికి అందించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా తనకు సెక్యూరిటీగా ఉండే అంగరక్షకుడిపై హోంమంత్రి చేయి చేసుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ANN TOP 10