AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో రెండో రోజూ కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్‌లో రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అమీర్‌పేట్, శంషాబాద్ కూకట్‌పల్లితో సహా పలు ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. డైరెక్టర్ సోంపల్లి నాగ రాజేశ్వరి పూజాలక్ష్మి ఎండీ కృష్ణ ప్రసాద్ ఇళ్ల పై రెండో రోజు కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. శంషాబాద్‌లోని చిట్‌ఫండ్ సంస్థ యజమాని రఘువీర్ ఇల్లు, ఆఫీసులపై సోదాలు జరిగాయి. కూకట్‌పల్లిలోనూ హిందూ ఫార్చునాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. చిట్ ఫండ్స్ ఫైనాన్స్ సంస్థల్లో ఆదాయ పన్ను చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలతో రెండవ రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. కీలకమైన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ANN TOP 10