AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జియోమార్ట్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ధోనీ

రిలయన్స్‌ రిటైల్స్‌కు చెందిన ఇ-కామర్స్‌ ప్లాట్‌ ఫామ్‌ జియోమార్ట్‌ కు భారత క్రికెట్‌ దిగ్గజం మహేంద్ర సింగ్‌ ధోనీ (Ms Dhoni) బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ తాజాగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. కాగా, జియోమార్ట్‌లో భాగమైనందుకు ధోనీ సంతోషం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు షాపింగ్‌ జర్నీలో భాగం కావాలని పిలుపునిచ్చారు.

మైదానంలో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్న ధోనీ.. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కేవలం ఐపీఎల్‌ (IPL) సీజన్‌లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ధోనీ నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో టచ్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా ఈ మిస్టర్‌ కూల్‌.. కొత్త లుక్‌లో ద‌ర్శన‌మిస్తున్నాడు. చాలా స్టయిలిష్‌ లుక్‌తో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. కొత్త త‌ర‌హా హెయిర్ స్టయిల్‌తో డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో టార్జన్ త‌ర‌హా హెయిర్ స్టయిల్‌తో కిక్ ఇచ్చిన ధోనీ, మ‌ళ్లీ ఇప్పుడు దాదాపు అలాంటి హెయిర్ స్టయిల్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ANN TOP 10