AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ కు బిగ్ షాక్..! కాంగ్రెస్ గూటికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కీలక నేత

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సన్నిహిత నేతగా మనోహర్ రెడ్డికి పేరుంది. పరిగి నియోజకవర్గం టికెట్ ను ఆశించాడు. కానీ, ఇటీవల బీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మనోహర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్దలు మనోహర్ రెడ్డిని సంప్రదించడంతో పాటు, తాండూరు నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తెలిసింది. దీంతో ఆయన బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమయ్యారు.

మనోహర్ రెడ్డి ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గురువారం ఆయన నివాసంలో కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి ప్రసాద్ హాజరు కానున్నారు. అనంతరం ప్రసాద్, రామ్మోహన్ రెడ్డిలు మనోహర్ రెడ్డిని రేవంత్ వద్దకు తీసుకెళ్లనున్నారు. రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో మనోహర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10