AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బ‌లోచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి.. 34 మంది మృతి

బ‌లోచిస్తాన్‌లోని మ‌స్తుంగ్ జిల్లాలో ఇవాళ ఆత్మాహుతి దాడి జ‌రిగింది. ఆ సూసైడ్ బ్లాస్ట్ వ‌ల్ల సుమారు 34 మంది మ‌ర‌ణించారు. దాదాపు వంద మందికిపైగా గాయ‌ప‌డ్డారు. అల్‌ఫ‌లా రోడ్డు వ‌ద్ద ఉన్న మ‌దీనా మ‌సీదు స‌మీపంలో మిలాద్ ఉన్ న‌బి ర్యాలీ తీసేందుకు జ‌నం గుమ్మిగూడారు. ఆ స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించిన‌ట్లు ప్ర‌త్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. డీఎస్పీ గిశ్‌కోరి కారు వ‌ద్ద‌ బాంబు పేలిన‌ట్లు అనుమానిస్తున్నారు. ఆ ఊరేగింపుకు బందోబ‌స్తు ఏర్పాటు చేస్తున్న పోలీసు వాహ‌నం స‌మీపంలో సూసైడ్ బాంబర్‌ ఉన్న‌ట్లు భావిస్తున్నారు. డీఎస్పీ కారు వ‌ద్దే బాంబ‌ర్ త‌న‌ను తాను పేల్చుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. బాంబు పేలిన ప్రాంతం చెల్లాచెదురైంది. శ‌వాల‌న్నీ గ‌ట్ట‌లుగా ప‌డి ఉన్నాయి. తీవ్రంగా గాయ‌ప‌డ్డ‌వారిని క్వెట్టాకు త‌ర‌లిస్తున్నారు. స‌మీపంలో ఉన్న అన్ని ఆస్ప‌త్రుల్లో ఎమ‌ర్జెన్సీ విధించారు.

ANN TOP 10