న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణంలో గోరంట్ల బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బుచ్చిబాబుకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్‌ను మంజూరు చేసింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తు, పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని సిబిఐ కోర్టు ఆదేశించింది.
ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేసులో 14వ నిందితుడైన రామచంద్ర పిళ్లైకి ఛార్టెడ్ అకౌంటెంట్‌గా వ్యవహరించాడు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బుచ్చిబాబు కీలక పాత్ర పోషించాడని ఆరోపణ. మద్యం విధానం రూపకల్పనలో హైదరాబాద్‌కు చెందిన అనేక సంస్థలకు భారీగా లబ్ధి చేకూరే విధంగా బుచ్చిబాబు వ్యవహరించాడని ఆరోపణ ఉంది.