హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం జరుగుతున్న సంగతి తెలిసిందే. గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సంజీవయ్య పార్క్ వద్ద బాలుడు మృతి చెందాడు. ప్రమాదవశాత్తు గణనాథుని తీసుకొని వస్తున్న లారీ టైర్ కింద పడి మృతి చెందాడు. చనిపోయిన బాలుడు కిషన్‌భాగ్ కు చెందిన ప్రణీత్ కుమార్ గా గుర్తించారు పోలీసులు. సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ వెంట వచ్చిన ప్రణీత్..లారీ టైర్ కింద పడి మృతి చెందాడు. అటు మరో ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. బషీర్‌భాగ్ ఫ్లై ఓవర్ సమీపంలో లారీ టైర్ కింద పడి మృతి చెందాడు. నిమ్మజ్జనం చేయడానికి బైక్ పై ఓ కుటుంబం వస్తోంది. అయితే.. బైక్ స్కిడ్ కావడంతో కిందపడిపోయారు ఆ కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే… బైక్ పై నుంచి కిందపడ్డ నాలుగేళ్ళ బాబుపై నుంచి టస్కర్ వాహనం వెళ్లింది. నీలోఫర్ లో చికిత్స పొందుతూ ఆ నాలుగేళ్ళ బాలుడు ఆయుష్ చనిపోయాడు. కాగా.. బెల్లంపల్లి కి చెందిన బాధిత రాజశేఖర్ కుటుంబం, సంతోష్ నగర్ ప్రెస్ కాలనీలో నివాసం ఉంటుంది.









