AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వ వైద్యులకు తీపి కబురు

రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యుజిసి ఎరియర్స్‌ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డిఎంఇ) పరిధిలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బదిలీకి పచ్చ జెండా ఊపింది. నెలరోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిఒ కాపీలను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు వైద్య సంఘాల ప్రతినిధులకు స్వయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగం అభివృద్ధికి సిఎం కెసిఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. భారీగా బడ్జెట్ కేటాయించి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతోపాటు.. వైద్య సిబ్బందికి ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటున్నారని చెప్పారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ పరిధిలో భారీగా నియామకాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 1,479 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. పిజి డాక్టర్లను డిహెచ్,టివివిపి నుంచి డిఎంఇ వైపు తీసుకున్నామని వివరించారు. ఇలా ఐదేండ్లలో మొత్తం 688 మందిని తీసుకున్నామని చెప్పారు. 761 వైద్యులకు అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్ ప్రొఫెసర్లుగా, 545 వైద్యులకు అసోసియేట్ ప్రొఫెసర్ నుంచి ప్రొఫెసర్లుగా, 31 మందికి అడిషనల్ డైరెక్టర్లుగా ప్రమోషన్ ఇచ్చామన్నారు.

ANN TOP 10