నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందనవారు ఉన్నారు. హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై చింతపల్లి మండలం నసర్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కంపల్లి గ్రామానికి చెందిన మద్దమడుగు ప్రసాద్ (38) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. సొంతూరు అక్కంపల్లి వెళ్లేందుకు బుధవారం మధ్యాహ్నం భార్య రమణి (35), కుమారూడు అవినాష్ (12)తో కలిసి బైక్‌పై బయల్దేరాడు. అదే సమయంలో మల్లేపల్లి నుంచి హైదరాబాద్‌కు నలుగురు యువకులు కారులో బయల్దేరారు. చింతపల్లి మండల పరిధిలోని నసర్లపల్లి పీవీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోకి రాగానే.. మూల మలుపు వద్ద కారు అదుపుతప్పి ప్రసాద్ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. అనంతరం కారు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన పడిపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ప్రసాద్ ఆయన రజిని, కుమారుడు అవినాష్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు.









