AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వీళ్లు నిజమైన స్నేహితులంటే.. ఫ్రెండ్ సమాధి వద్ద బర్త్‌డే వేడుకలు

చనిపోయిన తమ స్నేహితుని పుట్టినరోజును అతని సమాధి వద్ద నిర్వహించి, నివాళులు అర్పించి.. వారి ఫ్రెండ్‌షిప్‌‌ను నిరూపించుకున్నారు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం భీమారం మండల కేంద్రానికి చెందిన యండీ మోహీన్ ఖాన్.. గత సంవత్సరం భీమారం నుంచి కొడిమ్యాల వెళ్తుండగా రోడు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జరిగి సంవత్సరం గడిచినా.. మోహిన్ జ్ఞాపకాలు అతని మిత్రులను వెంటాడుతూనే ఉన్నాయి. ఈ రోజు మోహిన్ పుట్టినరోజు కావడంతో ఎంతో బాధతో తన స్నేహితునికి పుట్టినరోజు వేడుకలు జరిపించాలనుకున్నారు.

తమ స్నేహితుడు తమ మధ్య లేడు అనే భాదతోనే.. మోహిన్ సమాధి వద్ద పుట్టినరోజు వేడుకలు జరిపారు. గ్రామంలో ఫ్లేక్లీలు ఏర్పాటు చేసి.. సమాధి వద్ద స్వీట్లు, కేకు కట్ చేశారు. తమ స్నేహితుడు తమ‌ మధ్య లేడన్న విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నామని ఆస్నేహితులు చెప్పుకొచ్చారు. అందుకే తన స్నేహితుడు మృతి చెందినా.. తనకు ఈ పుట్టినరోజు వేడుకలు జరిపామని చెప్పుకొచ్చారు.

ANN TOP 10