AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చంద్రబాబుపై సీఐడీ మరో కేసు.. A1గా వేమూరి, A2గా సాంబశివరావు

ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంతో పాటు రాజధాని ఇన్నర్ రింగ్‌ రోడు టెండర్ల విషయంలో కేసులు నమోదు కాగా.. ఇప్పుడు మరో స్కాం జరిగిందంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీలో ఫైబర్‌ నెట్‌ టెండర్ల విషయంలో స్కాం జరిగిందని ఆరోపించి సీఐడీ.. అందులో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా చేర్చుతూ ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ దాఖలు చేసింది. కాగా.. ఈ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే.. ఈ ఫైబర్‌ నెట్‌ స్కాంలో సుమారు రూ.121 కోట్ల నిధులు దోచుకున్నారని సిట్‌ దర్యాప్తులో తేలిందని సీఐడీ చెప్తొంది.

2019 లోనే ఫైబర్‌ నెట్‌ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో A1గా వేమూరి హరి ప్రసాద్‌, A2 మాజీ ఎండీ సాంబశివరావుగా చేర్చింది. అయితే.. వేమూరి హరిప్రసాద్‌, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావటం గమనార్హం. దీంతో ఫైబర్‌ నెట్‌ స్కాంలో చంద్రబాబు పాత్రను సీఐడీ గుర్తించింది. బ్లాక్ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది.

నిబంధనలకు విరుద్ధంగా టెండర్‌ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ తేల్చింది. బ్లాక్‌ లిస్ట్‌లో ఉన్న టెర్రా సాఫ్ట్‌కు టెండర్‌ దక్కేలా మేమూరి చక్రం తిప్పినట్టుగా ఆరోపిస్తున్నారు. ఫైబర్‌ నెట్‌ ఫేజ్‌-1లో రూ.320 కోట్లకు టెండర్లు వేయగా.. అందులో రూ. 121 కోట్ల అవినీతిని సీఐడీ గుర్తించింది. టెర్రా సాఫ్ట్‌కు టెండర్లు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

ANN TOP 10