AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నన్ను కట్టడి చేయలేరు… విమర్శలకు భయపడను

కోర్టు కేసులు, విమర్శలకు భయపడనని.. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని గవర్నర్ తమిళిసై స్పష్టం చేశారు. నాలుగేళ్లు పూర్తీ చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజల విజయమే తన విజయమన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉందని కానీ గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగ్గా సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉందన్నారు.

తనకు పొలిటికల్ ఎజెండా లేదని.. ప్రజలకు సేవ చేయడం తప్ప అని చెప్పుకొచ్చారు. తనది కన్నింగ్ మెంటాల్టి కాదన్నారు. పేదలకు ఏదో చేయడం తప్ప అని తెలిపారు. పీపుల్ ఫ్రెండ్లి గవర్నర్‌గా ఉండాలని అనుకుంటా అంతే అని అన్నారు. తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు అని అన్నారు. తన మైండ్‌లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. ‘‘నా కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాలు మాత్రమేనేను ఎవరికీ భయపడను. రాజ్యాంగం పరిధిలోనే పనిచేస్తున్నాను. నేను చేసే ప్రజా కార్యక్రమాలను కొందరు రాజకీయం చేశారు. బహుశా నేను రాజకీయ కుటుంబం నుంచి రావడం అయుండొచ్చు’’ అంటూ గవర్నర్ వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10