6,500 టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు: మంత్రి సబిత
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. టీచర్ పోస్టుల భర్తీకి రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామని మంత్రి సబితారెడ్డి తెలిపారు. మొత్తం 6,500 టీచర్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ మేరకు మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇందులో పాఠశాల విద్యలో 5,089 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు తెలిపారు. రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదలతో పాటు విధి విధానాలు విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. తెలంగాణలో వరుస ఉద్యోగాల నోటిఫికేషన్లతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.