మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్ఎస్ హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఏ క్షణమైనా ‘మైనంపల్లిపై సస్పెన్షన్ వేటు’ అని ప్రగతి భవన్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో మైనంపల్లి వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మైనంపల్లి వ్యాఖ్యలను సహించని కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు ‘పోటీ చేయాలా వద్దా అనేది.. మీ ఇష్టం’ అని క్లియర్ కట్‌గా చెప్పేశారు. పనిలో పనిగా చివరి నిమిషంలో అయినా సరే కొందరు అభ్యర్థులను మార్చే ఛాన్స్ ఉందని కూడా చెప్పేశారు. ఈ క్రమంలో మల్కాజిగిరి బరిలో ఇద్దరు కీలక వ్యక్తులను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.









