AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆగండి.. ఆగండి.. ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారో చూడండి..

బాగా పరిశీలనగా చూడండి.. ఇంకా గుర్తుపట్టలేదా? అదేనండి మన పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. పవన్‌తో ఆడుకుంటున్న ఈ చిన్నోడిని గుర్తుపట్టారా? వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఈ రోజే విడులైందండి. ఇప్పుడు గుర్తుపట్టి ఉంటారు. అవును.. మురిపెంగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌తో ఆడుకుంటున్న పవన్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ ఫొటో ఎవరు పోస్ట్‌ చేశారు? ఎక్కడిది అనేగా మీ సందేహం..! తెలుసుకుందాం రండి..

దర్శకుడు సముద్రఖని తెరకెక్కించిన చిత్రం ‘బ్రో’ జులై 28న థియేటర్లలో విడుదలై బాగా ఆకట్టుకుంటోంది. పవన్‌, సాయిధరమ్‌ తేజ్‌ ఈ క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన ఈ మువీ ఇప్పటికే అభిమానుల్లో హైప్‌ క్రియేట్‌ చేసింది. ఈ రోజు ఈ మువీ విడుదల సందర్భంగా సాయి తేజ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పవన్‌తో ఉన్న త్రోబ్యాక్‌ ఫొటో షేర్‌ చేశాడు. అంతేకాకుండా ఓ ఎమోషనల్‌ నోట్‌ కూడా రాసుకొచ్చాడు. మావయ్య పవన్‌ కల్యాన్‌పై తనకున్న ప్రేమను, అభిమానాన్నంతటినీ మరోమారు చాటాడు.

అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ.. ఈ రోజును ఏమని పిలవాలి? నా కల నెరవేరిన రోజు.. మర్చిపోలేని రోజు.. జీవితంలో గుర్తుండిపోలేని ఓ మధరు జ్ఞాపకం. నా మనసులోని భావాలను ఈ రోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. గురువు, మామయ్య, మామ నాకు అన్నీ పవన్‌ కల్యాన్‌ మావయ్యే. ఆయన్ని చూస్తూ ఎదిగాను. ఇప్పటికీ ఆయన చేతిని పట్టుకుని నడుస్తున్న చిన్నపిల్లవాడినే. త్రివిక్రమ్‌ గారూ నన్ను నమ్మినందుకు థ్యాంక్యూ. నన్ను నమ్మి నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు ప్రతిఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సాయి తేజ్‌.

ANN TOP 10