AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కుమారుడితో కలిసి తిరుమల కొండకు రమ్యకృష్ణ

తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని ప్రముఖ నటి రమ్యకృష్ణ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుమారుడు రిత్విక్ వంశీతో కలిసి రమ్యకృష్ణ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో రమ్యకృష్ణ, రిత్విక్‌లకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రమ్యకృష్ణతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు కొంత మంది ఆసక్తి కనబరిచారు.

కృష్ణవంశీతో పెళ్లి
ఐదు భాషల్లో 260కి పైగా సినిమాల్లో నటించిన రమ్యకృష్ణ.. 2003లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని పెళ్లిచేసుకున్నారు. 2003 జూన్ 12న వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు రిత్విక్ వంశీ ఒక్కడే సంతానం. చెన్నైలో నివాసం ఉండే రమ్యకృష్ణ.. కుమారుడు రిత్విక్‌ను ఎప్పుడూ పెద్దగా హైలైట్ చేయరు. సోషల్ మీడియాలో సైతం కుమారుడు గురించి పెద్దగా పోస్టులు పెట్టరు. కాకపోతే ఇప్పుడు ఏడుకొండలవాడి దర్శనం కోసం ఆమె తిరుమల తీసుకొచ్చారు.

ANN TOP 10