రాష్ట్రంలోని దివ్యాంగులకు ఇస్తున్న ఆసరా పెన్షన్లను పెంచుతూ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. అయితే.. ఇప్పటివరకు దివ్యాంగులకు 3016 ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో వెయ్యి రూపాయలు పెంచుతూ రూ. 4016 ఇవ్వాలని నిర్ణయించింది. ఈరోజు సచివాలయంలో జరిగిన సుదీర్ఘ భేటీలో కేసీఆర్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేసింది సర్కారు. అయితే.. పెంచిన పింఛన్లు ఈ నెల నుంచే అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా.. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో మొత్తం 5 లక్షల 20 వేల మంది లబ్ధి పొందనున్నారు. కాగా.. ఈ నిర్ణయంపై మంత్రులు హర్షం వ్యక్తం చేస్తూ… సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.









