AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆ రోజు బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చా.. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావోద్వేగం

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కిషన్‌ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకార కార్యక్రమంతో బీజేపీ కార్యాలయం అంతా సందడిగా ఉంది. అయితే ఇదే సమయంలో రాజ గోపాల్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అక్కడనున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

బండి సంజయ్‌ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన సమయంలో.. ఆయనను చూసి కన్నీళ్లు వచ్చాయన్న రాజగోపాల్‌ రెడ్డి, ఆ సమయంలో బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చానంటూ ఆవేదను వ్యక్తం చేశారు. బండి సంజయ్‌ రాజీ లేని పోరాటం చేసి పార్టీకి ఊపు తెచ్చిన వ్యక్తి అన్నారు. బండి సంజయ్‌ విషయంలో తనకు బాధ కలిగిందని చెప్పుకొచ్చారు. బండి సంజయ్‌ అధ్యక్షుడుగా రాజీ లేనీ పోరాటం చేసిన నాయకుడు అన్నారు.

ఇక అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కట్టుబడి ఉంటామన్న రాజగోపాల్‌.. కానీ బండి సంజయ్‌ని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు. రాజాగోపాల్‌ రెడ్డి.. బండి సంజయ్‌ పేరును ప్రస్తావించగానే సభా ప్రాంగణంలో ఒక్కసారిగా హర్షధ్వనాలు చేశారు.

ANN TOP 10