AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేసీఆర్ కు హైకోర్టు షాక్‌.. నోటీసులు జారీ!

రాష్ట్ర సర్కార్ కు, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. కోకాపేటలో బీఆర్ఎస్ కు భూమి కేటాయింపుపై అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు విచారణ సందర్బంగా ఆదేశించింది. కాగా కోకాపేటలో బీఆర్ఎస్ కు 11 ఎకరాల భూమి కేటాయించారు. దీనిపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ జరిపిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

రూ.50 కోట్ల విలువైన భూమిని రూ.3.41 కోట్లకు కేటాయించారని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అలాగే దీనికి సంబంధించి డాక్యూమెంట్లను రహస్యం చేశారని వాదనలు వినిపించారు. ఈ క్రమంలో కోర్టు ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి నోటీసులు ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను ఆగస్టు 16కి హైకోర్టు వాయిదా వేసింది. కోర్టు నోటీసులతో సీఎంగా, బీఆర్ఎస్ అధినేతగా సీఎం కేసీఆర్ కు షాక్ తగిలినట్లైంది.

ANN TOP 10