AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వరంగల్‌లో సైకో వీరంగం.. ఓ ఇంట్లోకి చొరబడి..

వరంగల్ లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. ఈ విచిత్ర సైకో సంఘటన పుప్పాలగుట్ట ప్రాంతంలో జరిగింది. అతను ఎవరో అక్కడివారికి తెలియదు. కానీ అతడు నేరుగా ఓ ఇంట్లోకి చొరబడ్డాడు. ఇంట్లో ఉన్నవారిపై రాయితో దాడి చేశాడు. దీంతో వారి అరుపులు విన్న స్థానికులు హడలెత్తిపోయారు. ధైర్యం చేసి అతన్ని పట్టుకొని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి రెండు సంచులు చేత పట్టుకొని ఇంట్లోకి ప్రవేశించాడు. ఎవరు మీరని ప్రశ్నించడంతో అతడు ఆగ్రహంతో ఇంటి యాజమానిపై రాయితో దాడి చేశాడు. ఇంట్లో వారి అరుపులు విని ఇరుగు పొరుగు వారంతా అక్కడి చేరుకున్నారు. ఎవరు నువ్వని నిలదీయడంతో ఆసీఫ్ అనే మరోవ్యక్తిపై ఆ సైకో దాడికి పాల్పడ్డాడు.

అతని మానసిక స్తితి సరిగా లేదనని స్థానికులు గుర్తించారు. చివరికి అతడ్ని పట్టుకుని ఓ స్తంభానికి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చిన అతడ్ని తీసుకెళ్లారు. అయితే దాదాపు రెండు గంటల పాటు ఆ సైకో సృష్టించిన వీరంగంతో స్తానికులు హడలెత్తిపోయారు. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.

ANN TOP 10