AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్విట్ట‌ర్‌కు షాకిచ్చిన హైకోర్టు..

ట్విట్ట‌ర్ కు క‌ర్నాట‌క హైకోర్టు షాక్ ఇచ్చింది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఆదేశాల‌పై అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను కోర్టు తిర‌స్క‌రించింది. 2021 ఫిబ్ర‌వ‌రి నుంచి 2022 మ‌ధ్య కేంద్ర ప్ర‌భుత్వం ప‌దిసార్లు ట్విట్ట‌ర్‌ను బ్లాక్ చేయాల‌ని ఆదేశించినట్లు ట్విట్ట‌ర్ త‌న పిటీష‌న్‌లో పేర్కొన్న‌ది. మ‌రో 39 యూఆర్ఎల్స్‌ను కూడా తీసివేయాల‌ని కేంద్ర ఐటీశాఖ ఆదేశించింది. అయితే ఆ ఆదేశాల‌ను త‌ప్పుప‌డుతూ ట్విట్ట‌ర్ దాఖ‌లు చేసిన పిటీష‌న్‌ను జ‌స్టిస్ కృష్ణ దీక్షిత కొట్టిపారేశారు. ఆ సంస్థ‌పై 50 ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించారు. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా ఎటువంటి వివ‌ర‌ణ‌ను ట్విట్ట‌ర్ సంస్థ ఇవ్వ‌లేద‌ని న్యాయ‌మూర్తి దీక్షిత్ తెలిపారు. 45 రోజుల్లోగా క‌ర్నాట‌క లీగ‌ల్ సెల్ స‌ర్వీసెస్‌కు 50 ల‌క్ష‌లు చెల్లించాల‌ని కోర్టు ట్విట్ట‌ర్‌ను ఆదేశించింది.

ANN TOP 10