తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యుడు రేగా కాంతారావు ఘనంగా స్వాగతం పలికారు. కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ సుగుణ గార్డెన్‌లో శుక్రవారం నిర్వహించిన పోడు భూమి పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆ సందర్భంగా రేగాకాంతారావు మంత్రికి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. గిరిజనులకు పోడు భూముల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పువ్వాడ అజయ్ కుమార్, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యేలు వనమా వెంటేశ్వరరావు, రేగా కాంతారావు, మెచ్చ నాగేశ్వర రావు, హరిప్రియ, జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధుల, అధికారులు పాల్గొన్నారు.









