ప్రముఖ గాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ మృతిపట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు. సాయిచంద్ అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తన ఆట, పాటతో తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసిన సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆవేదన చెందారు. ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. సాయిచంద్ కుటుంబ సభ్యులకు రేవతంత్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.









