AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామగుండంలో ఉగ్ర కదలికలు.. అనుమానితుల అరెస్ట్

తెలంగాణలో మరోసారి ఉగ్ర కదలికలు.. కలకలం సృష్టించాయి. గుజరాత్‌లో సముద్ర మార్గం ద్వారా పడవల్లో సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టులను ఏటీఎస్ బృందాలు అరెస్ట్ చేసి విచారించగా.. వారికి ఉన్న లింకులు తెలంగాణలో బయటపడ్డాయి. దీంతో నిఘా పెట్టిన ఏటీఎస్ బృందాలకు వచ్చిన సమాచారం మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంలో తనిఖీలు నిర్వహించారు.

టెర్రరిస్టులతో సంబంధం ఉన్నట్టు అనుమానాలతో మహ్మద్ జావీద్ అనే వ్యక్తితో పాటు.. ఆయన కూతుర్ని కూడా గుజరాత్ ఏటీఎస్ బృందం అదుపులోకి తీసుకుంది. అనంతరం వారిని ప్రత్యేక భద్రత నడుమ హైదరాబాద్‌లోని ఏటీఎస్ ప్రధాన కార్యాలయానికి తరలించారు.

జావిద్, అతడి కూతురును పోలీస్టేషన్ కు తీసుకెళ్లి ప్రశ్నించారు. అనంతరం కుటుంబ సభ్యులను వదిలిపెట్టి జావిద్, అతడి కూతురును అదుపులోకి తీసుకున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా గోదావరి ఖనికి వచ్చినట్టు తెలుస్తోంది. టోలిచౌక్ లో నివాసముంటున్న జావిద్ కంప్యూటర్ సెంటర్ నిర్వహిస్తున్నట్టు సమాచారం. జావిద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడంతో ఒక ప్రత్యేక సాఫ్ట్ వేర్ తయారుచేసి ఐసిస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. అతని కూతురు కూడా ఐసీస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తోందా అనే విషయంపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. నిందితులు ఇటీవలే టెర్రరిస్టులతో వాట్సప్ చాటింగ్ కూడా చేసినట్టుగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో పేలుళ్లతో కూడా సంబంధం ఉందన్న కోణంలోనూ విచారించనున్నారు.

ANN TOP 10