AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఘోర విషాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు దుర్మరణం

జగన్నాథ స్వామి ఉల్టా రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకున్నది. ఇద్దరు చిన్నారులు సహా ఏడుగురు విద్యుత్‌ షాక్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన త్రిపుర ఉనాకోటి జిల్లాలో బుధవారం జరిగింది. కుమార్‌ఘాట్‌లో సాయంత్రం జగన్నాథుడి ‘ఉల్టా రథయాత్ర’ జరిగింది. ఇటీవల జగన్నాథ రథయాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. బుధవారం ఉల్టా రథయాత్ర చేపట్టారు. వేడుకకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

పెద్ద సంఖ్యలో జనం ఇనుముతో చేసిన రథాన్ని జనం లాగుతున్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లను రథం తాకింది. దాంతో ఒక్కసారిగా విద్యుద్ఘాతంతో మంటలు చెలరేగాయి. విద్యుత్‌ షాక్‌తో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. బాధితులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

ANN TOP 10