AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వాళ్లను వదిలిపెట్టను.. కేసీఆర్, కవితపై మోదీ సంచలన వ్యాఖ్యలు

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ లో ఇవాళ ప్రధాని మోదీ పర్యటించారు. రాజధాని భోపాల్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా విపక్షాలపై మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం కేసీఆర్,ఎమ్మెల్సీ కవితపై ప్రధాని మోదీ ఫైర్ అయ్యారు. కుటుంబ రాజకీయాల గురించి మోదీ మాట్లాడుతూ.. ములాయం యాదవ్, శరద్ పవార్, లాలూ యాదవ్, ఒమర్ అబ్దుల్లా, కరుణానిధిని విమర్శిస్తూ.. ఆఖరులో కేసీఆర్‌, కవిత గురించి కూడా మాట్లాడారు. కేసీఆర్ కూతురుకి మేలు చేయాలంటే బీఆర్ఎస్ కు ఓటేయండని వ్యాఖ్యానించారు. మీ పిల్లలు..మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటు వేయండి అని కార్యకర్తలనుద్దేశించి మోదీ అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు(Kavitha) అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ విపక్షాలు విమర్శిస్తున్న తరుణంలో ప్రధాని మోదీ(PM Modi) చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. విపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

జూన్ 23న పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంపై మోదీ మాట్లాడుతూ..2024 ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుంది కాబట్టి మీటింగ్ లు పెట్టుకుని కలిసి వస్తున్నారన్నారు. ప్రతిపక్షం.. అవినీతి, కుంభకోణాలకు గ్యారెంటీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ఒక్కటే కొన్ని లక్షల రూపాయల అవినీతి చేసిందని.. ఆర్జేడీ, టీఎంసీ, ఎన్సీపీలన్నింటికీ కుంభకోణాల జాబితా చాలానే ఉందని ఆయన చెప్పారు.

ANN TOP 10