AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎంజీఆర్ జైత్రయాత్ర ఖాయమా?

గులాబీదళపతి కేసీఆర్ నమ్మకం
మంత్రి కేటీఆరే ఆయన ధైర్యం
జనంతోనే మమేకం.. జనంతోనే ప్రయాణం
ఖైరతాబాద్ ఎంజీఆర్ కు అపూర్వ ఆదరణ

(ఖైరతాబాద్ ప్రతినిధి)
రాష్ట్రంలో ఎన్నికల వేడి పూర్తిగా అలుముకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మరో పదిరోజుల్లో అభ్యర్ధుల జాబితా ప్రకటించవచ్చన్న ప్రచారాలు సాగుతున్నాయి. ఈసారి ఖైరతాబాద్ టికెట్ ఉద్యకారుడు, కేసీఆర్ కుటుంబానికి వీరవిధేయుడు మన్నె గోవర్ధన్ రెడ్డికి ఖాయమన్న చర్చ పార్టీవర్గాల్లో ఉంది. టికెట్లు మారనున్న నియోజకవర్గాల్లో ఖైరతాబాద్ స్థానం మొదటివరుసలో ఉందని, 15 నుండి 30 స్థానాల్లో కొత్త అభ్యర్ధులు రాబోతున్నారని ప్రగతిభవన్ వర్గాల సమాచారం. ఉద్యమం నుండి ఉన్న యువనేతలకు ఈసారి మూడు నుండి నాలుగు స్థానాలు లభించబోతున్నాయని, హైదరాబాద్ నగరంలోనే కనీసం రెండు స్థానాలు వీరికి ఇస్తారని తెలుస్తోంది. ఇప్పటికే మన్నె గోవర్ధన్ రెడ్డికి నాయకత్వం నుండి భరోసా లభించడంతో ఉత్సాహంగా ఉన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్న మన్నె గోవర్ధన్ రెడ్డి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిస్తూ ప్రజలను పలకరిస్తున్నారు. కేటీఆర్ ఐటీ మంత్రి కావడం వల్లే హైదరాబాద్ ఇంత అద్భుతమైన ప్రగతిని సాధించిందని వివరిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్న మన్నె గోవర్దన్ రెడ్డి(ఎంజీఆర్) సోమాజిగూడ డివిజన్ బీఎస్ మక్తాలో పోచమ్మ ఆలయాన్ని సోమవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు ఎంజీఆర్ కు శాలువా కప్పి సన్మానం చేశారు. 2014లో టికెట్ దక్కించుకుని పోరాడిన ఎంజీఆర్, 2018లో గెలుపుఖాయమన్న దశలో.. టికెట్ దక్కలేదు. ఈసారి కేసీఆర్ , మంత్రి కేటీఆర్ న్యాయం చేస్తారన్న విశ్వాసం నియోజకవర్గ క్యాడర్ లో కనబడుతోంది. కేసీఆర్ పిలుపును అందుకుని పోరాడిన యోధుని కోసం నియోజకవర్గం ఎదురుచూస్తోంది.

ANN TOP 10