ఎంపీ బండి సంజయ్ ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ సీట్ల గురించి తర్వాత.. కల్వకుంట్ల కవిత ఎందుకు అరెస్ట్ కాలేదో సంజయ్ చెప్పాలని డిమాండ్ చేశారు. కవిత కోసం జైలులో రూమ్ సిద్ధం చేశామని అన్నావ్.. ఏమైంది? అని ప్రశ్నించారు. ‘‘నువ్వు చేసిన పాదయాత్ర వెనుక కేసీఆర్ లేడా?.. బీజేపీకి అభ్యర్థులు లేరని అన్నది నువ్వే కదా. నీ పదవి పోతుందని పిచ్చిగా వాగుతున్నావ్. కేసీఆర్ మీతో కలిసి ఉండగా.. మాతో ఎందుకు వస్తారు?’’ అని పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
‘‘కాంగ్రెస్ అభ్యర్థులను కూడా కేసీఆరే డిసైడ్ చేస్తారు. 30 మంది అభ్యర్థుల జాబితా సిద్ధం చేశారు. తెలంగాణ అభివృద్ధిపై చర్చకు బీజేపీ సిద్ధం. పరేడ్ గ్రౌండ్‌లో చర్చకు కేసీఆర్ సిద్ధమా?.. హైదరాబాద్ దేశ రెండో రాజధాని అంశంపై పార్టీలో చర్చిస్తాం. తెలంగాణకు ఏది మంచో అదే చేస్తాం’’ అని బండి సంజయ్ ప్రకటించారు.









