AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యువతిపై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి..

యువతి మీద జిమ్ ట్రైనర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఫిలింనగర్‌లో చోటు చేసుకుంది. టోలిచౌకిలో గత కొన్నేళ్లుగా ఆసిమ్ (25) అనే వ్యక్తి జిమ్ నడిపిస్తున్నాడు. ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న యువతి జిమ్‌లో జాయిన్ అయ్యింది. ఆమెతో పరిచయం పెంచుకున్న ఆసీమ్ ప్రేమ పేరుతో వెంటపడి వేధిస్తున్నాడు.

ఇటీవల పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆసీమ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెళ్లి మాట ఎత్తకుండా జిమ్ ట్రైనర్ ముఖం చాటేశాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులను బాధిత యువతి ఆశ్రయించింది. ఫిలింనగర్ పోలీసులు నిందితుడిపై ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ANN TOP 10